కేసీఆర్ అనుమానం నిజమేనా.. క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర నిజంగానే జరిగిందా?

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. వరదల వల్ల సాధారణ ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరదల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీఎం కేసీఆర్ వరద భాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచనలు చేశారు.

బాధిత కుటుంబాలకు తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం అందించాలని కేసీఆర్ సూచనలు చేశారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. క్లౌడ్ బరస్ట్ అనే పద్ధతిలో వరదలను సృష్టిస్తున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. క్లౌడ్ బరస్ట్ కుట్రకు సంబంధించి వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉందని ఆయన కామెంట్లు చేశారు.

భద్రాచలంకు వరదలు వచ్చిన సమయంలో ప్రజలు ముంపుకు గురి కావడం బాధాకరమని కేసీఆర్ కామెంట్లు చేశారు. అయితే కేసీఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ కుట్రకు సంబంధించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేసీఆర్ చెప్పింది నిజమేనని భావిస్తుంటే మరి కొందరు కేసీఆర్ మాటలు నిజం కాకపోవచ్చని చెబుతున్నారు. అయితే టెక్నాలజీని వినియోగించి ఈ తరహా కుట్రలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

కేసీఆర్ అనుమానాలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందేనని చెప్పవచ్చు. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం ఈ తరహా కుట్రలు వెలుగు చూడటంతో కేసీఆర్ ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే కుట్ర జరిగినట్లు సాక్ష్యాలతో సహా కేసీఆర్ ప్రూవ్ చేసి ఉంటే బాగుండేదని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.