అదిరిపోయిన ఎల్ఐసి జీవన్ అక్షయ ప్లాన్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం హ్యాపీ!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలా జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండడం కోసం సరికొత్త స్కీమ్స్ అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ క్రమంలోనే ఎల్ఐసి జీవన్ అక్షయ ప్లాన్ ద్వారా ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ఎంతో హ్యాపీగా గడిపేయొచ్చు. మరి జీవన్ అక్షయ ప్లాన్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ జీవన్ అక్షయ ప్లాన్ పథకంలో భాగంగా ఒక్కసారి పెట్టుబడి పెడితే మనం ప్రతి నెల లేదా ప్రతి సమస్యనికి పెన్షన్ రూపంలో కొంత అమౌంట్ ని తీసుకోవచ్చు. ఇక ఈ పథకంలో డబ్బులు పెట్టడానికి ఒకేసారి ఆరు లక్షల పదివేల ఎనిమిది వందల ప్రీమియం డిపాజిట్ చేయాలి.
దీనిపై సమ్ అష్యూర్డ్ మొత్తం రూ. 6 లక్షలు ఉంటుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడికి వార్షిక పెన్షన్ రూ.76 వేల 650 రూపాయలు వస్తుంది.త్రైమాసిక ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవాలనుకుంటే ప్రతి మూడు నెలలకు రూ.18 వేల 225 వస్తుంది. అదే సమయంలో నెలవారీ పెన్షన్ 6 వేల 08 రూపాయలు.

ఇలా ప్రతి నెల మనం పెన్షన్ పొందవచ్చు. పెట్టుబడి దారుడు జీవితాంతం ఆయన మరణాంతం వరకు ప్రతినెల పెన్షన్ రూపంలో పెట్టుబడి పెట్టిన డబ్బును అందుకోవచ్చు. అయితే ఇలా ప్రతినెలా అధిక మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకోవాలనుకునేవారు వారి డిపాజిట్ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు ప్రతి నెలా 20 వేల రూపాయల పెన్షన్ పొందాలనుకుంటే ఒకేసారి 40 లక్షల 72 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ పథకం ద్వారా మనం ఎంత పెట్టుబడి పెడితే మనకు అంత లాభదాయకంగా ఉంటుంది చెప్పాలి.