పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రజలు తమ డబ్బుని పొదుపు చేసుకుంటూ ఉన్నారు. అయితే తమ అకౌంట్లో ఉన్న పొదుపు వివరాల గురించి తెలుసుకోవటానికి గతంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయించుకొని పాస్ బుక్ లో ప్రింట్ చేయించుకునేవారు. అలాగే బ్యాంక్ లో ఉన్న అకౌంట్ వివరాల గురించి కూడా బ్యాంకుకు వెళ్లి తెలుసుకునేవారు. అయితే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ వివరాలు ఇంట్లో కూర్చుని సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇవి బ్యాంకు ఖాతాదారుల సేవల వరకే పరిమితం.
అయితే పోస్టాఫీసు, బ్యాంకుల్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న డబ్బు వివరాలు గురించి తెలుసుకోవటానికి పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది. కాని ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారు సైతం ఇ-పాస్‌బుక్ ఫీచర్ ద్వారా కస్టమర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ప్రదేశం నుండి అయినా, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం లేకుండా తెలుసుకోవచ్చు. అయితే ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్ ఉపయోగించవచ్చు. పైగా ఈ సేవలను ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఇక ఇప్పుడు ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఇ-పాస్‌బుక్
పిపిఎఫ్, సేవింగ్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్ వివరాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి
www.indiapost.gov.in లేదా www.ippbonline.com లో అందించబడిన ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అఫిషియల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని నమోదు చేయాలి. అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ OTPని సమర్పించాలి. ఆతర్వాత మన ఖాతాలో బ్యాలెన్స్ తదితర వివరాలు గురించి మనం ఇంట్లో కూర్చొని పూర్తి వివరాలను పొందవచ్చు.