ప్రస్తుత కాలంలో తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండానే ఎక్కువ మొత్తం ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సంవత్సరాల పాటు ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలో పొందవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఐదేళ్లకు పెట్టుబడిగా పెడితే 5 ఏళ్ల తర్వాత దాదాపుగా 4.5 లక్షల రూపాయలు వడ్దీ రూపంలో లభిస్తుంది. ఈ స్కీమ్ ను మరో ఐదేళ్లు పొడిగిస్తే 10 లక్షల రూపాయలకు 11 లక్షల రూపాయల వడ్డీ లభిస్తుందని చెప్పవచ్చు.
మెచ్యూరిటీ తేదీలో సంబంధిత ఖాతాకు వర్తించే వడ్డీ రేటు గ్రేస్ పీరియడ్‌కు సైతం వర్తిస్తుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసే సమయంలో డబ్బులు అవసరం లేదని భావిస్తే మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించే అవకాశాలు ఉంటాయి. పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చుకాబట్టి ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ కు సంబంధించి సందేహాలు ఉంటే మాత్రం సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ పత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.