దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ తన కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో కస్టమర్స్ కి సేవలు అందించడానికి కొత్త కొత్త విధానాలను కూడా రూపొందిస్తోంది. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజలు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఎస్బిఐ కూడా యోనో యాప్ ద్వారా తన కస్టమర్స్ కి డిజిటల్ చెల్లింపులకు అవకాశాన్ని కల్పించింది. ఈ ఎస్బిఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లో కూర్చొని కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు.
యోనో యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరపటానికి మీ మొబైల్ ఫోన్ లో యోనో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లో యోనో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పేరు, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి మీ ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. మీ మొబైల్ ఫోన్ లో SBI YONO యాప్‌ని ఓపెన్ చేయటానికి పేరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో పేరు పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో యోనో యాప్ ఓపెన్ చేయటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యోనో యాప్ పేరు పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఈ యాప్ ఓపెన్ చేయటానికి మొదటగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా onlinesbi.com అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
ఆ తరవాత పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్ వద్ద ఉన్న లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇలా చేయగానే మీ డీటెయిల్స్ ని అడుగుతుంది. అప్పుడు యూజర్ నేమ్ / ఫర్గాట్ లాగిన్ పాస్‌వర్డ్ పైన క్లిక్ చేయండి.
అల క్లిక్ చేయగానే ఓ పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు డ్రాప్-డౌన్ మెను నుండి ఫర్‌గిట్ పాస్‌వర్డ్ మీద క్లిక్ చేయండి.
సీఐఎఫ్ నంబర్, దేశం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, INB రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయగానే ఓటిపి వస్తుంది. .
ఓటీపీ ని ఎంటర్ చేయగానే మీరు రిజిస్టర్డ్ చేసిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అలానే స్క్రీన్ మీద కూడా కనపడుతుంది.