ఏటీఎం నుంచి ఒకరోజులో ఎంత నగదు తీసుకోవచ్చు.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

ఒకప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలు ఫస్ట్ ఆప్షన్ గా బెస్ట్ ఆప్షన్ గా నిలిచేవి. బ్యాంకుల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే ఎన్నో సమస్యలు ఉండేవి. అందువల్ల ఏటీఎం కార్డుల సహాయంతో డబ్బులను విత్ డ్రా చేసేవారు. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం పెరగడంతో ఏటీఎంల ద్వారా లావాదేవీలను నిర్వహించే వాళ్ల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు.

డిజిటల్ చెల్లింపుల యుగంలో కూడా నగదు దాని విలువను కలిగి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతుండగా ప్రస్తుతం బ్యాంక్ నుంచి డబ్బులను విత్ డ్రా చేయడం సులువైన పని అనే సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ కాగా వినియోగదారులకు ఈ బ్యాంక్ వేర్వేరు ఆర్థిక సేవలను అందిస్తోంది.

క్లాసిక్ డెబిట్ కార్డ్ లేదా మాస్ట్రో డెబిట్ కార్డ్ నుండి రోజువారీ పరిమితి కేవలం 20000 రూపాయలు కావడం గమనార్హం. ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ రోజువారీ పరిమితి ఏకంగా లక్ష రూపాయలుగా ఉంది. టచ్ ట్యాప్ డెబిట్ కార్డ్‌ల పరిమితి 40000 రూపాయలు కాగా మెట్రో నగరాల్లో ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు 3 సార్లు ఉచితంగా డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది.

పరిమితి దాటిన తర్వాత ఎస్బీఐ ఏటీఎంలలో 5 రూపాయలు, ఇతర ఏటీఎంలలో 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్.డీ.ఎఫ్.సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా రోజువారీ పరిమితులు ఇతర బ్యాంకులకు భిన్నంగా ఉంటాయి. ఏటీఎంలను ఎక్కువగా వాడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.