ఇస్రో లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్లమో, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు భారతదేశంలో ఎక్కడైనా ఉపాధి కల్పించబడుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేది జనవరి 09, 2023 .దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇస్రో లో ఖాళీగా ఉన్న మొత్తం 526 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో అసిస్టెంట్- 339, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్- 153, సీనియర్ డివిజన్ క్లర్క్- 16, స్టెనోగ్రాఫర్- 14, అసిస్టెంట్ (స్పేస్)- 3, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (స్పేస్)- 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు :
• ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
• జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయటానికి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
• సీనియర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన అభ్యర్ధులు అర్హులు.
• స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు అర్హులు.
• అసిస్టెంట్ (స్పేస్) పోస్ట్ కి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
• జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (స్పేస్) పోస్ట్ కి అప్లై చేయటానికి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జనవరి 9, 2023 నాటికి గరిష్టంగా 28 ఏళ్లు మించకూడదు. కనిష్టంగా 18 ఏళ్ల ఉండాలి.