ఆర్మీ ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు శుభవార్త.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మన దేశంలో అగ్నివీర్ నియామకాల కోసం ప్రకటనలు రిలీజ్ కావడం గమనార్హం. కొన్ని ఉద్యోగాలకు కేవలం ఎనిమిదో తరగతి విద్యార్హతగా ఉంది. పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామకాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీలో సేవలు అందించవచ్చు.

ఆ తర్వాత వీళ్లలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మిగిలిన వాళ్లకు ఆర్థిక ప్రోత్సాహకంతో పాటు స్కిల్ సర్టిఫికెట్ అందుతాయని సమాచారం అందుతోంది. టీజీ అభ్యర్థులకు సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ లో ఏపీ వాళ్లకు గుంటూరు, వైజాగ్ లో ఉన్న నియామక కేంద్రాల ఆధ్వర్యంలో పరీక్షలు, ఫిజికల్ టెస్టులను నిర్వహిస్తారని తెలుస్తోంది.

మొదట ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన ప్రతిభావంతులకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. లైట్ మోటార్ వేహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లకు డ్రైవర్ పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ఆధారంగా ప్రశ్నాపత్రం ఉంటుంది.

క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు టైప్ పరీక్ష అదనంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఇతర ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.