టెలిగ్రామ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్?

ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న వినియోగదారులు ఎక్కువగా వాట్సప్ ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే టెలిగ్రామ్ ఉపయోగించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ టెలిగ్రామ్ మాత్రం సరికొత్త అప్డేట్లను వినియోగదారులకు అందిస్తూ వినియోగదారుల సంఖ్యను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టెలిగ్రామ్ ప్రీమియర్ తీసుకున్న యూజర్ లతోపాటు స్టాండర్డ్ యూజర్ల కోసం కొత్త అప్ డేట్స్ తీసుకొచ్చింది. తాజాగా టెలిగ్రామ్ లో
వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే..

మనకు ఇదివరకే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియాల ప్లాట్ ఫామ్ లో ఉండే యూజర్ నేమ్స్ ని టెలిగ్రామ్ బయోలో పోట్టుకోవచ్చు. మనకు ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో వారితో ముచ్చటించాలంటే వారి పిక్ పై టచ్ చేస్తే చాలు ఆయా సోషల్ మీడియా సైట్లలోకి తీసుకు వెళుతుంది.ఇకపోతే చాలామంది వాయిస్ రూపంలో మెసేజ్ పంపిస్తారు అయితే అందరిలో ఉన్నప్పుడు ఇలాంటివి వినడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఆ వాయిస్ మెసేజ్ ను టెక్స్ట్ రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు.

12 రకాల కస్టమైజ్డ్ ఇమోజీ, స్టిక్కర్ ప్యాక్ లను తీసుకొచ్చింది. ఐఓఎస్ వినియోగదారుల కోసం డార్క్ థీమ్‌లు అప్‌డేట్ వచ్చింది. దీనివల్ల చాట్‌, చాట్ లిస్ట్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు బ్లర్రింగ్ ఎఫెక్ట్‌లలో రంగులు మరింత బ్యాలెన్స్‌గా కనిపిస్తాయి. ఇకపోతే మనం ఏదైనా సమాచారాన్ని ఎమోజీ రూపంలో పంపించాలనుకుంటే ఆ ఏమోజికి రిప్లై వచ్చే ఎమోజిలన్నీ కూడా మనకు స్క్రీన్ పైన అందుబాటులో ఉంటాయి. ఇలా సరికొత్త ఫీచర్స్ అప్డేట్ చేస్తూ టెలిగ్రామ్ వినియోగదారుల ముందుకు రానుంది.