Keerthy Suresh: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు అయితే ఇటీవల కాలంలో ఈమె బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. ఇటీవల బేబీ జాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ డిసెంబర్ 12వ తేదీ గోవాలో తన ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో హిందూ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన మూడు రోజులకి ఈమె తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కూడా విడుదల కావడంతో హనీమూన్ వెళ్లారు.
ఇలా కీర్తి సురేష్ తన హనీమూన్ పీరియడ్ పూర్తి అయిందో లేదో అప్పుడే అభిమానులకు శుభవార్త చెప్పారు ఇలా ఈమె గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ అంత స్పీడ్ ఏంటి కీర్తి అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరి ఈమె చెప్పిన శుభవార్త ఏంటి అనే విషయానికి వస్తే…
కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్‌కు జంటగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ సినిమాలకు గుడ్ బై చెబుతుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా కీర్తి తన కొత్త సినిమాను ఓకే చేయడంతో అభిమానులు షాక్ అతున్నారు. పెళ్లి తర్వాత తమకంటూ కొంత సమయాన్ని కేటాయించకుండా ఇలా సినిమాలలో నటించడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.