జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలలో నివసించే వారికి కూడా 5జీ సేవలు..!

టెలికాం రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఇటీవల యూజర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇటీవల ప్రారంభించిన 5జి సేవలను విస్తృతం చేస్తూ మరిన్ని ప్రాంతాలలో 5జి సేవలు అందించడానికి అడుగులు వేస్తోంది. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తాజాగా రాజస్థాన్లో కూడా 5 జి సేవలు ప్రారంభించాడు. అంబానీ కుటుంబ సభ్యులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీనాథజీ దేవాలయంలో ఆకాశ అంబానీ 5 జి సేవలు ప్రారంభించాడు. రిలయన్స్ జియో చైర్మన్ గా ఆకాష్ అంబానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను చేపట్టిన కీలక ప్రకటన ఇదే అని చెప్పవచ్చు.

5 జి సేవలను విస్తృతం చేయటానికి ఆకాష్ అంబానీ శనివారం ఉదయం ఉదయపూర్ చేరుకొని అక్కడినుండి శ్రీనాథ్ జి ఆలయానికి చేరుకున్నాడు. ఆ తర్వాత 5 జి సర్వీసులు ప్రారంభించాడు. దీంతో రాజస్థాన్ లో ఉన్న జియో యూజర్లకు 5జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశంలో కొన్ని ప్రసిద్ధి చెందిన పట్టణాలలో అక్టోబర్ ఒకటవ తేదీ నుండి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వారణాసి, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై పట్టణాలలో ఉన్న జియో హై స్పీడ్ 5 జి సేవలు వినియోగించవచ్చు.

ఈ 5 జీ సేవలు వినియోగించడానికి కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాలి… లేదంటే 4జీ సిమ్ కలిగిన వారు ప్రత్యేకంగా 5జి సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఫోర్ జి సిమ్ ఉన్నా కూడా 5 జి ఇంటర్నెట్ ని యాక్సిస్ చేయగలుగుతుంది. ఇక 5జీ ఫోన్ కలిగిన వారు ఆటోమేటిక్‌గా జియో 5జీ వెల్‌కమ్ ఆఫర్ పొందొచ్చు. ఈ వెల్కం ఆఫర్ లో భాగంగా జియో కస్టమర్లు 1 జీబీపీఎస్ స్పీడ్‌తో అపరిమిత 5జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. అయితే ఈ ఫెసిలిటీ పొందటానికి రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.