గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త..ఇకపై రూ. 1000 వరకు ఆదాయం..?

gas

ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ల వాడకం తప్పనిసరి అయింది. ప్రతి ఇంట్లో వంట చేయటానికి గ్యాస్ సిలిండర్ లో వాడుతున్నారు. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వాలు కూడా రోజురోజుకీ రేటు పెంచుతున్నాయి. పెరుగుతున్న గ్యాస్ రేట్ ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోజు రోజుకి గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతున్న తరుణంలో పేటీఎం ప్రజలకు ఒక శుభవార్త తెలియజేసింది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ లో బుక్ చేసుకున్న వారికి రూ.5 నుండి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం అందిస్తున్న నాలుగు రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్లు కొనటానికి ఇబ్బంది పడుతున్న వారు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసే సమయంలో గ్యాస్1000 అనే ప్రోమో కోడ్ ని ఉపయోగించుకొని క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ కోడ్ ద్వారా కస్టమర్లు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్రీగ్యాస్ అనే ప్రోమో కోడ్ కూడా ఉంది. ఈ ప్రోమో కోడ్ ఎంచుకుంటే.. ప్రతి 500వ కస్టమర్‌కు రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ వినియోగదారులకు పేటీఎం మరో ఆఫర్ కూడా అందిస్తోంది. ఏయూ క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేస్తే..దాదాపు రూ. 50 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఇలా రూ.50 క్యాష్ బ్యాక్ పొందడానికి ఏయూసీసీ 50 ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి డిస్కౌంట్ పొందొచ్చు. సిలిండర్ బుకింగ్‌పై రూ. 30 తగ్గింపు వస్తుంది.

అయితే ఈ ఆఫర్ పొందాలంటే గ్యాస్‌యస్‌సీసీ అనే ప్రోమో కోడ్ వాడాలి. పేటీఎం ద్వారా సిలిండర్ బుక్ చేయడం కోసం ముందుగా పేటీఎం యాప్‌లోకి వెళ్లి బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మీది ఏ గ్యాస్ కంపెనీయో అక్కడ ఉన్న భారత్, హెచ్‌పీ, ఇండేన్ ఇలా మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి..ప్రోసీడ్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రోమో కోడ్ అప్లై చేసి గ్యాస్ బుకింగ్ చేయాలి. ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీకు క్యాష్‌బ్యాక్ అమౌంట్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్లు కొంత కాలం వరకే ఉంటాయి.