అమరావతి భూముల సాక్షిగా టీడీపీ కి చావుదెబ్బ కొట్టిన జగన్!

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఆంద్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఒడిపోయినప్పటికి పట్టు వదలకుండా ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రజల్లో తనపై ఒక రకమైన సానుభూతిని కలిగేలా చేశాడు. జగన్ వేసిన రాజకీయ వ్యూహాలకు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా చెక్ పెట్టలేకపోయాడు. కనీసం తాను అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను కూడా చంద్రబాబు ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయాడు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ను వ్యహరచణ కర్తగా పెట్టుకొని ఎన్నికల్లో చంద్రబాబును తెరుకోలేని దెబ్బ కొట్టారు. ఈ దెబ్బ నుండి చంద్రబాబు నాయుడు ఇంకా కొలుకోలేదు. వైసీపీ అఖండమైన గెలుపుతో టీడీపీ నేతల్లో ఉత్సహం తగ్గిపోయింది. కొంత మంది నాయకులు వైసీపీలోకి వెళ్తున్నారు.

అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ చంద్రబాబు తన హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజధానిని చంద్రబాబు దురుద్దేశంతో కట్టారని, అక్కడి భూములన్నీ తమ పార్టీ నేతలకు, తమ కులస్తులకు ఇచ్చారని వైసీపీ నాయకులు నిరూపించడంతో టీడీపీ నాయకులపై ప్రజల్లో కూడా ఆదరణ తగ్గింది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అమ‌రావ‌తి విషయంలో కావచ్చు, పార్టీని న‌డిపే విధానంలో కావొచ్చు చంద్రబాబు నూత‌న ప‌ద్ధతుల‌ను అవలంబించ‌డం లేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

కాలానికి త‌గిన విధంగా చంద్రబాబు దూసుకుపోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది. ప్రజ‌ల్లో ఇప్పుడు పార్టీపై గ‌తంలో ఉన్న సానుభూతి కూడా క‌రువైంది. ముఖ్యంగా రాజ‌ధానిని క‌మ్మ సామాజిక వ‌ర్గం కోసం క‌ట్టార‌నే అధికార పార్టీ నేత‌ల విమ‌ర్శల‌ను త‌న‌దైన శైలిలో తిప్పికొట్టడంలో చంద్రబాబు విఫ‌ల‌మ‌య్యార‌నేది వాస్తవం. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి వైఎస్సార్‌సీపీ క‌మ్మలను మిగిలిన కులాల నుంచి దూరం చేసే ప్రక్రియ ప్రారంభించి, దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నా టీడీపీ నేత‌లు ఎవ్వరూ స‌మర్థవంతంగా తిప్పికొట్టలేక‌పోయారు.

సరైన ఆధారాలతో టీడీపీ నేతల తప్పులను వైసీపీ నేతలు నిరూపిస్తున్నప్పుడు టీడీపీ నేతలు కనీసం వాటికి ఖండించలేని స్థితిలో ఉన్నారు. సరైన ప్రణాళిక వల్ల టీడీపీపై జగన్ ప్రయత్నించిన వ్యూహానికి చంద్రబాబు ఇంకా కొలుకోలేపోతున్నారు.