ఇప్పటికే కరోనా వల్ల ప్రజలు బాధపడుతున్న సమయంలో ఇప్పుడు ఈ వరదల వల్ల ప్రజలు ఇంకా సతమతమవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రాంతాలు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు.
తదనంతరం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో.. ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దని సూచించారు.వరద తగ్గుముఖం పట్టగానే 10రోజుల్లో పంటనష్టం అంచనాలు పంపించాలని.. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్దరించాలని జగన్ ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో 95 క్యాంప్ లలో 14477మందికి వసతి కల్పించామని అధికారులు సీఎంకు విన్నవించారు. పశ్చిమ గోదావరిలో 26 శిబిరాల్లో 5వేల మంది వసతి కల్పించామని తెలిపారు.వరద తగ్గగానే 10రోజుల్లో పంట నష్టం అంచనావేసి సాయం చేయాలని, వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్దరించాలని సీఎం ఆదేశించారు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్ష నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి విపత్తు జరిగిన సమయంలో దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే వ్యాఖ్యలతో ప్రభుత్వంపై సాధారణంగా ప్రతిపక్షాల నేతలు విరుచుకుపడతారు. ఈసారి జగన్ మోహన్ రెడ్డి వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా ప్రజలు కూడా ఇంకా ప్రభుత్వాన్ని అడకముందే వారికి సహాయాన్ని ప్రకటించి ప్రతిపక్షాల నోర్లు మూయించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజల దగ్గర హిట్ అవ్వగా, ప్రభుత్వాన్ని విమర్శించాలనుకునే ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జగన్ మాత్రం ప్రజల క్షేమం కోసం ఎల్లవేళల కృషి చేస్తారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు ఉండదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.