ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ మళ్ళీ తీసుకురావడం వెనక ఇంత వ్యూహం ఉందా!

YCP and BJP

స్వాతంత్ర్య దినోత్సవం రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని రోజులు ప్రత్యేకహోదా గురించి జగన్ తన ప్రెస్ మీట్స్ లలో మాట్లాడారు, మళ్ళీ దాని గురించి పట్టించుకోలేదు.

YS Jagan
YS Jagan

సడెన్ గా ఆగస్ట్ 15న జగన్ తన ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఎన్నికల ముందు కేంద్రం మెడలు వంచి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్, ఇప్పుడు మాత్రం కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేవరకు అడుగుతూనే ఉంటామని చెప్తున్నారు. కేంద్రానికి ఆల్రెడీ అధిక బలముందని, ఇప్పుడు కేంద్రానికి తమ అవసరం లేదని జగన్ వివరణ ఇచ్చారు. అయితే 15న మాట్లాడిన మాటల వెనక మాత్రం పెద్ద వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

కేంద్రానికి మన ఎంపీల అవసరం ఉంటేనే ప్రత్యేక హోదా ఇస్తుందని, లేకపోతే ఇవ్వదని, ఏపీపై ఢిల్లీకి పెద్దగా కన్సర్న్ లేదని చెప్తూ ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీపై ప్రజల్లో చేదు అభిప్రాయం కలగటానికి ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ప్రత్యేక హోదా సాధించాలంటే ఖచ్చితంగా తనకు ఉండాలని ఆయనకు ప్రజలకు సందేశం ఇస్తున్నారనే వార్తలు కుడా వినిపిస్తున్నాయి.

భవిష్యత్ లో కేంద్రం తనకు మళ్ళీ రాజకీయ మైలేజ్ అవసరమైనప్పుడు హోదా అంశాన్ని మళ్లీ ఉద్యమంగా మార్చడానికి ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఇప్పటికే మాట తప్పారని, కేంద్రానికి భయపడుతున్న జగన్ ఇకఎప్పటికి ప్రత్యేక హోదా సాధించారని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇప్పటి నుండే ప్రత్యేక హోదా విషయంలో వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ వేస్తున్న ఎత్తులను టీడీపీ నేతలు ఎలా ఎదురుకొంటారో వేచి చూడాలి.