కొత్త చట్టం మీద మన స్టార్ హీరోలు స్పందించరా ?

Why tollywood not responding over cinematograph act
Why tollywood not responding over cinematograph act
కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952కు ఇటీవల కొన్ని సవరణలు చేసింది. సెన్సార్ అయిన సినిమాలను సైతం రీ-ఎగ్జామిన్ చేసే అధికారం కేంద్రానికి ఉండటం లాంటి పలు అంశాలతో రూపొందిన ఇండియన్ సినిమాటోగ్రఫీ అమాండ్ మెంట్ బిల్ 2021ని కేంద్రం ఆమోదించింది.  గతంలో సెన్సార్ సభ్యులు లేదా రివైజింగ్ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ తో దర్శక నిర్మాతలు విభేదించేట్టయితే వారు ట్రిబ్యూనల్ వద్దకు వెళ్ళే వీలు ఉండేది.  కానీ కొత్త సవరణతో ఆ ఆస్కారం లేకుండా పోయింది.  ఎలాంటి సమస్య ఉన్నా వారు తప్పనిసరిగా హైకోర్టును దర్శక నిర్మాతలు ఆశ్రయించాల్సిన ఉంటుంది.
 
ఇదే సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు నచ్చడం లేదు. స్టార్ హీరోలు చాలామంది ఈ సవరణను  వ్యతిరేకిస్తున్నారు.  ముఖ్యంగా తమిళ హీరోలు, దర్శకులు ఎక్కువ మంది గట్టిగా అపోజ్ చేస్తున్నారు.  కమల్ హాసన్, సూర్య, కార్తి, విశాల్, దర్శకులు కార్తీక్ సుబ్బారాజ్, లింగుస్వామి,అనురాగ్ కశ్యప్, హిందీ నటుడు ఫర్హన్ అక్తర్ లాంటి వాళ్ళు  సర్టిఫికెట్‌ పొందిన సినిమాపై రీ సర్టిఫికేషన్ జరిపేందుకు కేంద్రానికి అధికారం ఇవ్వడం ఫిల్మ్ మేకర్స్ స్వేచ్ఛను హరించడమే అంటున్నారు. అయితే ఇతర పరిశ్రమల పెద్దలు స్పందించినట్టు భారీ పరిశ్రమ అయిన టాలీవుడ్ నుండి మాత్రం హీరోలు, దర్శకులు నిర్మాతలు రెస్పాండ్ కావట్లేదు.