తిరుపతి టీడీపీ అభ్యర్థి మౌనమేల..? చంద్రబాబుకు భారీ షాక్ తగలబోతుందా..?

panabaka lakshmi

 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోని ఎన్నికల కోసం సిద్ధం అవుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని వైసీపీ పావులు కదుపుతుంది, మరోపక్క ఈ సస్థానం నుండి పోటీచేయడానికి తమకే అవకాశం కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

panabaka lakshmi

 ఇక ప్రతిపక్ష టీడీపీ పార్టీ అందరికంటే ముందుగా తిరుపతి నుండి పోటీచేయబోతున్న తమ అభ్యర్థిని ప్రకటించింది. 2019 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు తేడాతో ఓడిపోయిన పనబాక లక్ష్మిని మరోసారి పోటీకి దించాడు చంద్రబాబు నాయుడు. ఆమెను ఖరారు చేసి వారం రోజులు అవుతున్న కానీ ఆమె నుండి ఎలాంటి ప్రకటన కూడా రాకపోవటంతో, తిరుపతి నుండి పోటీచేయటం ఆమెకు ఇష్టం లేదని, చంద్రబాబుతో ఆమె కు పొసగటం లేదని, ఆమె వాలకం చూస్తుంటే బాబుకు పెద్ద షాక్ ఇవ్వబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

 అయితే వాటికీ చెక్ పెట్టె విధంగా ఒక వార్త తాజాగా బయటకు వచ్చింది. తమ కుమార్తె వివాహ నిశ్చితార్థం కారణంగానే సైలెంట్‌గా ఉన్నామని.. ఎన్నికల బరిలోకి దిగడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామంటూ.. వారు ఇద్దరూ వెళ్లి.. మాజీ మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డికి స్పష్టం చేశారు. తమ అభ్యర్థిత్వంపై అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని.. రేపో ఎల్లుండో చంద్రబాబును కలిసిన తర్వాత.. ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తామని వారు సోమిరెడ్డికి చెప్పినట్లుగా తెలుస్తోంది.నవంబర్ 28న తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పనబాక లక్ష్మి ముహుర్తం ఖరారు చేసుకున్నారు.

 మరోపక్క పనబాక లక్ష్మితో సంబంధం లేకుండా ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కమిటీలను ఏర్పాటు చేసి టీడీపీ ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పనబాక లక్ష్మి ఎన్నికల గోదాంలోకి దిగితే పార్టీకి బలం అవుతుందని, ఆలస్యం చేసే కొద్దీ ఆమె మీద నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.