Devotional: మృత్తికా ప్రసాదం అంటే ఏమిటి.. దీనితో ఏం చేస్తారో తెలుసా?

Devotional: సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి వారి ప్రసాదంగా వివిధ రకాల ఆహార పదార్థాలను లేదా పండ్లను స్వామివారి ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు. కానీ కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్య ఆలయానికి వెళితే అక్కడ స్వామి వారి ప్రసాదంగా పుట్టమట్టిని భక్తులకు ఇస్తారు. దీనినే మృత్తికా ప్రసాదం అని పిలుస్తారు.అయితే ఇలా ఇచ్చిన మట్టితో భక్తులు ఏం చేస్తారు.. దీనివల్ల ప్రయోజనం అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…

భక్తులకు ఇచ్చే పుట్టమట్టిని మృత్తికా ప్రసాదం అని అంటారు. ఈ మృత్తికా ప్రసాదాన్ని కొందరు భక్తులు నోట్లో వేసుకుంటారు. మరికొందరు ఈ ప్రసాదం తినడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ విధంగా తినడానికి ఇష్టపడని వారు ఈ ప్రసాదాన్ని ఇంట్లో భద్ర పరుచుకుంటారు. అదేవిధంగా ఎవరైతే పాము భయంతో ఉంటారో అలాంటి వారు ఈ మృత్తిక ప్రసాదం నుదుటన పెట్టుకుని పడుకుంటే ఎలాంటి భయాలు ఉండవు. అదే విధంగా వారి కలలోకి ఎలాంటి పాములు కూడా రావు.

అదే విధంగా ఎంతో మంది యువతీ యువకులకు వివాహ వయసు వచ్చినప్పటికీ పెళ్లి జరగదు. ఈ క్రమంలోనే అలాంటి వారు పెళ్లి సంబంధాల కోసం వెళుతున్న సమయంలో స్నానం చేసే నీటిలో కాస్త పుట్ట మట్టిని,అలాగే చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే పెళ్లి చూపులకు వెళ్లడం వల్ల వారికి పెళ్లి సంబంధం సరిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలా ఆలయంలో ఇచ్చే ఈ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.