Vastu Tips: 2026లో మీ ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే చాలు.. దరిద్రులు కూడా కోటీశ్వరులు అవుతారంట..!

కొత్త సంవత్సరం 2026కు అడుగులు పడుతున్న వేళ వాస్తు శాస్త్రం మరోసారి కీలక సంకేతాలు ఇస్తోంది. సంఖ్యా శాస్త్ర ప్రకారం 2026 అంకెలన్నీ కలిపితే వచ్చే ఫలితం ‘1’. ఈ సంఖ్యకు అధిపతి పరిపాలన గ్రహమైన సూర్యుడు. అందుకే రాబోయే ఏడాది మన జీవన విధానంపై, ముఖ్యంగా గృహ వాతావరణంపై సూర్య ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో కొన్ని సాధారణ మార్పులు చేసుకుంటే అదృష్టం, శుభఫలితాలు స్వయంగా వెతుక్కుంటూ వస్తాయని సూచిస్తున్నారు.

సూర్యుడు శక్తి, ఆత్మవిశ్వాసం, అధికారానికి ప్రతీక. అందుకే 2026లో ఇంటి తూర్పు దిశ అత్యంత కీలకంగా మారుతోంది. ప్రతి రోజు ఉదయపు సూర్య కిరణాలు ప్రవేశించే తూర్పు భాగంలో సూర్య దేవుని ప్రతిమను ఏర్పాటు చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణుల అభిప్రాయం.

కొత్త ఏడాది రాకముందే ఇంటి తూర్పు భాగానికి రంగుల మార్పు చేస్తే మరింత శుభఫలితాలు లభిస్తాయని అంటున్నారు. ఎరుపు రంగు సూర్య శక్తిని ప్రతిబింబిస్తే, నీలపు ఛాయలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ రెండు రంగులను సమన్వయంగా ఉపయోగించడం వల్ల ఇంట్లో శాంతి, సుఖసంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి, మీరు కోరుకున్న ఫలితాలు దగ్గరవుతాయని చెబుతున్నారు.

ఆధ్యాత్మికంగా మరింత బలాన్ని కోరుకునే వారు పూజా గదిలో ఏకముఖ లేదా పన్నెండుముఖ రుద్రాక్షలను ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని విశ్వాసం. దీని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ముందుకు సాగడం జరుగుతాయని చెబుతున్నారు. వివాహ యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయని కూడా వాస్తు పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా ఒక ముఖ్యమైన సూచనగా ఇంటి పూర్వ దిశలో సూర్యుడికి సంబంధించిన యంత్రాన్ని స్థాపించడం ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అంటున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఈ వాస్తు పరిహారాలను అమలు చేస్తే 2026లో ఎదురయ్యే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. సూర్యుడి శక్తిని ఇంట్లోకి ఆహ్వానించాలంటే పెద్ద మార్పులు అవసరం లేదని, చిన్న కానీ సరైన అడుగులే చాలు అని వాస్తు శాస్త్రం మరోసారి గుర్తుచేస్తోంది.