Megastar Acharya : మెగాస్టార్ “ఆచార్య” పై వైరల్ అవుతున్న కొత్త గాసిప్.!

Megastar Acharya : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న పలు క్రేజీ మల్టీస్టారర్ చిత్రాల్లో మెగా స్పెషల్ మల్టీస్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాస్టార్ కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఇది. అయితే ఈ సినిమా రిలీస్ కి గాను అల్రెడీ ఫిబ్రవరి 4 ఫిక్స్ కాగా ఇప్పుడు దీనిపైనే మళ్లీ కొన్ని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఇందులో మేటర్ ఏమిటంటే ఆచార్య సినిమా అనుకున్న డేట్ కి రిలీస్ కావడం లేదట.

అంటే డిలే అవుతుంది అని కాదు ఒక వారం ముందే సినిమా రిలీస్ అవుతుందట అంటే జనవరి 26నే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ విషయం పై చిత్ర బృందం చర్చలు జరుపుతున్నారు అట. మరి ఇది ఎంత వరకు సాధ్యం అయ్యి మెగా ట్రీట్ ముందే వస్తోందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.