సెల్ఫీ పిచ్చిలో పడి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వింత వింత ప్రయోగాలతో ఫోటోలు తీసుకుంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తూ వాటిని ఫోన్ లో చిత్రీకరించడానికి యువత ప్రాణాలను పోగొట్టుకుంటుంది.సెల్ఫీ పిచ్చిలో పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా జరిగాయి.అయినప్పటికి యువతలో మార్పు రావడం లేదు. అంతేకాకుండా సెల్ఫీల కోసం అలాగే వాటివల్ల వచ్చే లైకులు కామెంట్లు కోసం కొంతమంది యువత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తమ చుట్టూ ఏముంది, వారు ఎంత ప్రమాదకరమైన స్థలంలో ఉన్నారు అని పట్టించుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సరదాగా గోదావరిని చూసేందుకు వెళ్లి నలుగురు యువకులలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మిగతా ఇద్దరిని జాలర్లు కాపాడారు.గల్లంతైన యువకులలో ఒకరు జాలర్లు చేపల కోసం వేసిన వలల్లో చిక్కుకున్నాడు. ఆ మృతుడు రామానుజవరం కి చెందిన సందీప్ గుర్తించారు. సమీపంలోని మణుగూరు మండలం రామానుజవరానికి చెందిన నలుగురు యువకులు గోదావరి నది లోని అందాలను చూడడానికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయారు. ఆ యువకులంతా క్లాస్ మేట్స్ గా పోలీసులు గుర్తించారు.
ఆ యువకులు గల్లంతు అవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన జరగగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనే ఒక యువకుడి మృతదేహం వెలికి తీసిన రిస్క్యూ టీమ్ మరొక యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఆ యువకుల తల్లిదండ్రులు మృతదేహాలను చూసి గుండెలువిలసేలా రోదిస్తున్నారు.