ఖర్చు దండగ వ్యవహారం రవితేజా.!

రవితేజ కొత్త సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మోషన్ పోస్టర్ కూడా వచ్చింది. గోదావరి నదిపై, ఓ వంతెన మీద నుంచి రైలు ద్వారా పోస్టర్‌ని వదిలారు.

దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా ప్రయోగం.. అంటోంది చిత్ర యూనిట్. ముందు ముందు హెలికాప్టర్లను వినియోగిస్తారేమో.! పబ్లిసిటీ స్టంట్లు అంటే అలాగే వుంటాయ్.

ఇంతా చేసి, ఈ పోస్టర్‌ ద్వారా సినిమాకి వచ్చిన అదనపు బజ్ ఏంటి.? అంటే, గుండు సున్నా అని చెప్పక తప్పదు. పెయిడ్ ట్రెండింగ్ తప్ప, ఆర్గానిక్ ట్రెండింగ్ అనేదే లేకుండా పోయింది.

‘అనవసరంగా రిస్క్ చేశారు. ప్రయోగం బూడిదలో పోసిన పన్నీరైపోయింది’ అని రవితేజ అభిమానులే గుస్సా అవుతున్నారట. అన్నట్టు, ఈ సినిమాతో రేణుదేశాయ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది.