మహాశివరాత్రి వేడుకల్లో విషాదం

మహాశివరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామం లోని ముక్తేశ్వరం తుల్యభాగ నది కాలువలో పుణ్య స్నానాలు వెళ్లిన  ఇద్దరు యువకుల ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందారు. మృతులు  పేప కాయల అజయ్ కుమార్(20), గొల్లపల్లి యశ్వంత్(20)గా గుర్తించారు. పండుగ రోజున బిడ్డలు  మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.