వైకాపా-జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య పొసిగేది ఎప్పుడు. అందుకు ఎంత మాత్రం ఆస్కారం లేదు. ఎప్పటికప్పుడు ఇరు పార్టీల మధ్య ఏదో అంశంపై వివాదం నలుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల వారు విమర్శలు, ఆరోపణలు చేసుకేంటూనే ఉంటారు. ఇది కొత్తేం కాదు. తాజాగా ఈసారి ఈ రెండు పార్టీల అభిమానుల మధ్య మాస్క్ మంట రేగింది.పవన్ ముక్కుకి వేసుకున్న ఈ మాస్క్ ప్రత్యేకంగా తయారు చేయించిందిట. ఆ మాస్క్ మీద `Specially Designed For PK’అని రాసి ఉంది. ముక్కుతో పాటు నోరు కూడా కవర్ చేస్తోందీ మాస్క్. దీనిపై జనసైనికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ వ్యాప్తి గురించి తెలిసినా ఎలాంటి మాస్క్ వేసుకోకుండా బయటకు వచ్చారని..మా పవన్ మాత్రం నిబంధలను తూచ తప్పకుండా పాటిస్తున్నారని ట్వీట్లు చేసారు. మరి తమ నాయకుడిని విమర్శిస్తే వైకాపా అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా? తిరిగి ఇవ్వాల్సిందే కదా! అదే జరిగింది. రాష్ర్టానికి ప్రథమ పౌరులుగా ఉండే గవర్నర్ గారు, ముఖ్యమంత్రిగారు సామాన్యుల్లా 10 రూపాయల ధరగల మాస్క్ ని ధరించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖరీదైన మాస్క్ ని…దానిపై పీకే అని మళ్లీ పేరును రాసుకుని సినిమా స్టైల్లో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
ఇదంతా తన హోదాని చెప్పుకోవడం కోసమే స్పెషల్ డిజైన్ మాస్క్ వేసుకున్నారని మండిపడ్డారు. దీంతో జనసేన కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. ఈనేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ట్విటర్లో పతాక స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీ అభిమానుల మధ్య ఇలాంటి యుద్ధాలు కొత్తేం కాదు. ఎన్నికల ముందు..ఆ తర్వాత ఇలాంటి వివాదాలు చాలాసార్లు తెరపైకి వచ్చాయి. ఓపిక ఉన్నంత సేపు తన్నుకోవడం…తర్వాత కామ్ అపోయివడం! ట్విటర్..ఫేస్ బుక్…ఇన్ స్టా ,వాట్సాప్ ల్లో సహజంగా జరుగుతుంటుంది.