Tollywood industry : గడిచిన రెండేళ్ల కరోనా కాలంలో అత్యధికంగా నష్టపోయిన పరిశ్రమ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సినిమా పరిశ్రమే అని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఆ సమస్య అనుకుంటే మన తెలుగు సినిమాకి మరిన్ని బాధలు. సరికొత్త రూల్స్ మరియు రెగ్యులేషన్స్ తో ఇంకా కొత్త తల నొప్పులు తెచ్చుకున్నారు.
దీనితో సడెన్ గా టికెట్ ధరలు తగ్గించేయడం.. తర్వాత మళ్ళీ పెంచడం ఇలా చాలానే హంగామా నడిచింది. అయితే తాజా ఇండస్ట్రీలో వారు అంతా ఒక ప్రధాన సమస్యని గుర్తించడం స్టాట్ చేశారు. పెద్ద సినిమాలు వస్తుంటే ప్రతి దానికి ఇన్ని రోజులు అని టికెట్ ధరల హైక్ లను పెంచుకుంటూ వస్తున్నారు.
అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు ధరలు ఆకాశంలోకి వెళ్లడంతో ఆడియెన్స్ కొత్త రిలీజ్ అంటేనే దూరం జరుగుతున్నారు. దీనితో మొదట్లో పెద్దగా తెలియలేదు కానీ ఒక్కో సినిమా వస్తుండడం తో బుకింగ్స్ లో అందరికీ క్లియర్ గా విషయం తేట తెల్లం అవుతుంది. గతంలో అయితే ఏపీ తెలంగాణాలో టికెట్స్ ఆన్లైన్ లో వదిలితే మూడు రోజులు దొరికేవి కాదు కానీ..
ఇప్పుడు ఉన్న భారీ ధరలతో మొదటి రోజే థియేటర్స్ లో టికెట్స్ కనిపిస్తున్నాయి. దీనితో ఆడియెన్స్ లో ఆసక్తి తగ్గుతుంది అని ఇండస్ట్రీ వర్గాల వారు ఇప్పుడు గమనించారట. అందుకే ఇక రాబోయే సినిమాల్లో దాదాపు ఏ సినిమాలకు కూడా హైక్స్ లేకుండా సాధారణ ధరల తోనే రిలీజ్ చేస్తారట. ఇది అయితే ప్రస్తుతానికి మంచి నిర్ణయమే అని చెప్పాలి. ఇది ఎన్నాళ్ల వరకు ఉంటుందో చూడాలి ఇక.