ఇక్కడ మార్కెట్ లేదు, సౌత్ కి వెళ్ళిపోతా .. బాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు!

నేడు తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్న నేపథ్యంలోనే బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం బాలీవుడ్ మారడం లేదు కాబట్టి నేను సౌత్ కి వెళ్ళిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.ఆర్జీవీ శిష్యుడిగా కెరీర్ మొదలుపెట్టిన అనురాగ్ కశ్యప్ దర్శకుడిగా అనేక హిట్ సినిమాలు ఇచ్చి బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారారు. దర్శకుడిగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా, నటుడిగా కూడా బిజీ అయ్యాడు.

ఇతని సినిమాలు బాలీవుడ్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇక బాలీవుడ్ ని వదిలేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేసాడు అనురాగ్ కశ్యప్.మంజుమల్ బాయ్స్ సినిమాని బాలీవుడ్ లో చూడరు. కానీ వాళ్ళు దాన్ని రీమేక్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఏది కొత్తగా చేయడానికి ప్రయత్నించట్లేదు. క్రియేటివ్ గా చేయడానికి రిస్క్ తీసుకోవట్లేదు.

కొంతమంది యాక్టర్స్ నటించడానికంటే కూడా స్టార్స్ అవ్వడానికి చూస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అనురాగ్ కశ్యప్. న‌టీన‌టులు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం కంటే గ్లామర్, ఫిజికల్ అప్పీరెన్స్‌పై దృష్టి సారిస్తారని, వారిని వర్క్‌షాప్‌లకు బదులు జిమ్‌కు పంపుతున్నారని ఆయన విమర్శించారు. మంజుమ్మెల్ బోయ్స్ లాంటి ప్ర‌యోగాలు బాలీవుడ్ లో చేయ‌లేర‌ని కూడా వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న స్టార్ల పారితోషికాలు, నిర్మాణ ఖ‌ర్చుల‌పై తన ఆందోళనను వ్యక్తం చేశాడు. నిర్మాతలు లాభాలు, మార్జిన్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, ఆర్థికపరమైన చిక్కుల కారణంగా సినిమాలతో ప్రయోగాలు చేయడం తనకు కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. సినిమాని ఎలా అమ్మాలి అనే ప్రశ్న ఉంటుంద‌ని, ఇది సినిమాని తీసే ప్రక్రియ ఆనందాన్ని హరిస్తుందని అన్నారు. దీంతో ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.