ప్రభాస్ కు పెళ్లి చేసిన ఫ్యాన్స్… భార్య, పిల్లల పిక్స్ వైరల్!

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ మాంచి ట్రెండింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా చాలా రంగాల్లో ఈ ఏఐ టెక్నాలజీ వైరల్ ఇష్యూ అవుతుంది. ఈ టెక్నాలజీతో రక రకాల ప్రయోగాలు చేస్తున్నారు ఏఐ ఎక్స్‌ పర్ట్స్. ఇందులో భాగంగా సెలబ్రెటీల ఫోటోలను రకరకాలుగా డిజైన్ చేసి వావ్ అనిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భార్య, పిల్లలతో ఉన్నట్లుగా పిక్స్ క్రియేట్ చేశారు.

అవును… ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రాం చరణ్, పవన్ కల్యాణ్ వంటి స్టార్స్‌ తో రూపొందించిన ఏఐ టెక్నాలజీ ఫోటోలు ఈ మధ్యకాలంలో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఒకలాంటి మాయ జాలంతో ఈ పిక్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. వారి వారి తాజా సినిమాలకు అనుగుణంగా హీరోల లుక్స్‌ ను ప్రీపేర్ చేస్తూ.. మెస్మరైజ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ప్రభాస్ .. కన్నప్పలో శివుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త రాగానే.. ఇలా ఉండాలని అభిమానులు డిజైన్ చేసి మరీ.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తొచ్చే ప్రభాస్ కు ఏఐ టెక్నాలజీతో పెళ్లి చేశారు ఫ్యాన్స్. గతంలో.. ఫలానా అమ్మాయితో ప్రభాస్ ఏడడుగులు వేయబోతున్నారంటూ గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందే. శెట్టా, సనన్ ఆ అంటూ ప్రభాస్ కి ఒక షోలో బాలయ్య నేరుగా అడిగేశారు కూడా.

అదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రేమ అంటూ వార్తలు వినిపించగా… మిర్చీ, బాహుబలి సమయంలో ప్రభాస్ – అనుష్క పెయిర్ అద్భుతం అని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని కొందరంటే… త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఫ్యామిలీ మెంబర్స్ ఆ దిశగా అనుష్క కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారని కథనాలొచ్చాయి.

ఈ సమయంలో… ప్రభాస్ పెళ్లి గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో అతడికి భార్య, కుమార్తెను క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ప్రభాస్ భార్య, పిల్లల ఫోటోస్ వైరలవుతున్నాయి. ఏఐ క్రియేషన్ చేస్తున్న మాయల్లో ఇదొకటి! ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూశాక అయినా ప్రభాస్ కు పెళ్లి ఆలోచన రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని తెలుస్తుంది.