Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనే విధంగా వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసినదే. ముఖ్యంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవంత్ సర్కార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేయడమే కాకుండా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. దీంతో అల్లు అర్జున్ కారణంగా సినిమా ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాల పట్ల చాలామంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ ను విమర్శిస్తున్నారు.
అల్లు అర్జున్ ఈగో కారణంగానే ఇలాంటి వివాదం చోటుచేసుకుందని ఆయన వల్ల ఇండస్ట్రీకి చాలా ఇబ్బందులు వచ్చాయి అంటూ చాలామంది అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేశారని అందరూ భావిస్తున్నారు కానీ ఆయన మాత్రం అల్లు అర్జున్ ని అడ్డుపెట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలెబ్రిటీల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన నేపథ్యంలో ఈ విషయంపై వివాదం చోటుచేసుకుంది. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం గురించి అలాగే సమంత నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడటంతో ఇండస్ట్రీ మొత్తం ఒంటి కాలిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి.
ఇలా కాంగ్రెస్ నేతలపై టాలీవుడ్ ఏకకంఠంతో విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరగడంతో అల్లు అర్జున్ ని అడ్డుపెట్టుకొని సినిమా సెలబ్రిటీలందరికీ కూడా గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు కానీ సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు అంటూ ఈయన తీసుకున్న నిర్ణయం చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి అల్లు అర్జున్ ని ఒక పావుగా వాడుకున్నారని స్పష్టం అవుతుంది.