Pawan Kalyan: పవన్ భారీ సినిమా నుంచి తప్పుకున్న హాట్ హీరోయిన్.?క్లారిటీ మీకోసం

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ సినిమాలు అనేకం వస్తున్నాయి. తెలుగు సినిమా ఖ్యాతి పెరగడంతో మన బిగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియన్ మార్కెట్ వైపు వెళుతున్నారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా “హరిహర వీరమల్లు”.

దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మళ్ళీ షూటింగ్ ని స్టార్ట్ చేసుకోనుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుంది అని ఓ టాక్ వైరల్ అవుతుంది.

అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి నిధి తప్పుకుందన్న ప్రచారం పూర్తిగా అబద్దం అని ఆమె ఈ చిత్రంలో కంటిన్యూ అవుతుంది అని తెలిసింది. మరి ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అంతా తెలుసుకోవాలి.