సాధారణంగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేసిన తర్వాత తలకు నూనె రాసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా తలకు నూనె రాసుకోవడం వల్ల కురులు దృఢంగా ఉండటమే కాకుండా అనేక చర్మ సంబంధిత సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అందువల్ల తరచూ తలకు నూనె రాసుకుని మర్ధన చేస్తూ ఉంటారు. ఇలా తలకు నూనె రాసి మర్దన చేయడం వల్ల మెదడు శరీరం ప్రశాంతంగా ఉంటుంది.. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు తలకు నూనె రాయటం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. వారంలో కొన్ని రోజులలో తలకు నూనె రాయటం అశుభంగా పరిగణిస్తారు. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో నిషేధించబడిన రోజులలో తలకు నూనె రాయటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మొదలవుతాయి.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారంలో ఏ ఏ రోజులలో తలకు నూనె రాయకూడదో తెలుసుకుందాం.
ఆదివారం :
సాధారణంగా ఉద్యోగస్తులు పిల్లలు అందరికీ ఆదివారం సెలవు దినం అవటంవల్ల తనకు నూనె రాసుకుని సోమవారం ఉదయం తల స్నానం చేయడం అలవాటుగా ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారం నాడు తలకు నూనె రాయటం నిషేధించబడింది. ఆదివారాన్ని ఆ సూర్యదేవునికి అంకితం చేశారు. అందువల్ల ఆదివారం నాడు తలకు నూనె రాయటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
మంగళవారం ;
మంగళవారం హనుమంతుడికి ప్రీతిపాత్రమైన దినం. అందువల్ల మంగళవారం నాడు తలకు నూనె రాయటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తటమే కాకుండా ఆయుష్ కూడా తగ్గుతుందని శాస్త్రాలలో వెల్లడించారు.
గురువారం :
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గురువారం రోజున తల స్నానం చేయటం తలకు నూనె రాయటం పూర్తిగా నిషేధించబడింది. గురువారం రోజున తలకు నూనె రాయటం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
శుక్రవారం :
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం రోజున తలకునూనె రాయటం వల్ల దరిద్ర దేవత తాండవిస్తుంది . అంతేకాకుండా ఇలా శుక్రవారం రోజున తలకు నూనె రాయటం వల్ల సమస్యలు ఎదురవటమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉండవు.
ఇక సోమవారం, బుధవారం, శనివారాలలో తలకు నూనె రాసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజులలో తలకు నూనె రాసుకోవడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని నమ్మకం.