Lucky Wife: ఈ తేదీల్లో పుట్టిన భార్యలు.. భర్తకు అదృష్టం తెచ్చి పెడతారంట..!

అదృష్టం వెంట తెచ్చే భార్య అనే మాట చాలామందికి వింటుంటారు. నిజంగానే భార్య పుట్టిన తేదీ భర్త అదృష్టాన్ని మార్చగలదా అన్నది సంఖ్యాశాస్త్రం చెబుతోంది. పుట్టిన తేదీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా, వారి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో భార్య జన్మతేదీ భర్త జీవితానికి కూడా శ్రేయస్సు తీసుకువచ్చే అవకాశముందని విశ్వసించబడుతోంది.

సంఖ్యాశాస్త్రం ప్రకారం 3, 12, 21, 30, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 18, 27 తేదీల్లో పుట్టిన మహిళలు ప్రత్యేకంగా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. వీరిని కలిగిన కుటుంబం ఆర్థికపరంగా, సామాజికపరంగా అభివృద్ధి చెందుతుందని చెబుతారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు సహజంగానే తెలివితేటలు, చురుకుదనం, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతారు. తమ భర్తలకు సరైన సలహాలు ఇస్తూ వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందే మార్గంలో తోడ్పడతారని నిపుణులు అంటున్నారు.

కొంతమంది భార్యలు ప్రేమ, దయ, కరుణతో కుటుంబాన్ని సమతుల్యం చేస్తారు. మరికొందరు ఆర్థిక వ్యవహారాలను బలంగా నిలబెట్టగల సామర్థ్యం కలిగివుంటారు. మరికొందరికి భవిష్యత్తు గురించి ముందుగానే అంచనా వేసే శక్తి ఉంటుంది. ఇంకొందరు కష్టపడి పనిచేసి, నాయకత్వ లక్షణాలతో భర్తలను విజయపథంలో నడిపిస్తారు. అలాగే, మరికొందరు ఉదారమైన మనసుతో భర్తకు, కుటుంబానికి ధైర్యం, విశ్వాసం కలిగిస్తారు. వారి ఉనికే ఇంట్లో శాంతి, ఆనందం, శ్రేయస్సు పెరగడానికి కారణమవుతుంది.

అయితే నిపుణులు చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేవలం జన్మతేదీపై ఆధారపడడం సరిపోదు. నిజమైన అదృష్టాన్ని తెచ్చేది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, కష్టపడే తత్వం. ఈ అంశాలు లేకపోతే కేవలం సంఖ్యలు జీవితాన్ని మార్చలేవని వారు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ తేదీల్లో పుట్టిన భార్య ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం మాత్రం కలుగుతుందనడంలో సందేహం లేదు.