సుధీర్ మీదున్న పిచ్చి ప్రేమతో అతని పేరుని టాటూ వేయించుకున్న యువతి..!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్ధస్త్ ద్వారా కామెడియన్ గా గుర్తింపు పొందాడు. జబర్దస్త్ స్టేజ్ మీద సుధీర్ చేసే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా సుధీర్ నటుడిగా కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా మెజీషియన్ గా, నటుడిగా , కామెడియన్ గా పాపులర్ అయిన సుధీర్ కి ప్రేక్షకులలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక సుధీర్ కి ఉన్న లేడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సాధారణంగా హీరో, హీరోయిన్లు మీద ఉన్న అభిమానం వల్ల చాలా మంది వారి పేరును పచ్చబొట్టు వేయించుకుంటారు. ఇలా సుధీర్ మీద ఉన్న అభిమానంతో ఒక యువతి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రీతి అనే ఓ యువతి సుధీర్‌ మీద ఉన్న అభిమానంతో ఏకంగా సుధీర్ పేరుని పచ్చబొట్టు వేయించుకుంది. అయితే ఆ యువతి ఆ ప్రేమను ఎలా వ్యక్త పరచాలో తెలియక. ఎప్పుడూ సుధీర్ ధ్యాసలోనే ఉంటూ సుధీర్ ని పిచ్చిగా ప్రేమిస్తూ సుధీర్ పేరుని తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించేసుకుందట.

అయితే ఆ యువతికి సుధీర్ మీద ఉన్నది అభిమానమో, ప్రేమో తెలియక సతమతమవుతూ తన సమస్యని పరిష్కరించాలని ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ఫోన్ చేసి సహాయం కోరినట్టు సమాచారం. అయితే సుధీర్ మీద తనకున్న ప్రేమ , అభిమానం గురించి తెలుసుకున్న డాక్టర్ కూడా ఒక్కసారిగ షాక్ అయ్యాడు. ఆ యువతి సమస్య గురించి తెలుసుకున్న డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి తన సమస్య నుండి బయటపడే మార్గం చెప్పాడు. ఇలా టీవి లో కనిపించే ఒక క్యారక్టర్ గురించి అతిగా ఆలోచించటం ,దానిని ప్రేమ అని ఫీల్ అవటం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం నువ్వు చదువు మీద ఏకాగ్రత పెట్టు అని డాక్టర్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.