కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని హై కోర్టు మొదటి నుండి చివాట్లు పెడుతూనే ఉంది. మళ్ళీ నిన్న జరిగిన విచారణలో కూడా హై కోర్టు తెలంగాణ విధానాన్ని తప్పు పట్టింది. ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా కూడా ఎందుకు అమలు చేయడంలేదని అగ్రహం వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వార విచారణకు హాజరైన రాష్ట్ర సోమేశ్ కుమార్ వీటికి సమాధానమిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని, రోజుకు 40 వేల టెస్టుల నిర్వహింహచడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
హాస్పిటల్స్ లలో జరుగుతున్న మోసలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా, దీనికి సోమేశ్ సమాధానమిస్తూ… ఇప్పటికే 50 హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చామని, వాటిలో 16 హాస్పిటల్స్ వివరణ ఇచ్చాయని తెలిపారు. వివరణ ఇవ్వని హాస్పిటల్స్ యొక్క గుర్తింపును రద్దు చేస్తున్నామని సోమేశ్ తెలిపారు. అయితే అపోలో , బసవ తారకం వంటి హాస్పిటల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించగా…పార్టీ విచారణ జరిగిన తరువాత చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
బసవ తారకం హాస్పిటల్ సినీ నటుడు బాలకృష్ణకు చెందినది. హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం బాలకృష్ణను టార్గెట్ చేయనుంది. ఈ హాస్పిటల్ ద్వార బాలకృష్ణ ఎంతోమందికి ఉచితంగా కాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో మోసలు చేసిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటూ కరోనా చికిత్స చేయడంపై నిషేధం విధించింది. ఇప్పుడు ఒకవేళ బసవ తారకం ఆసుపత్రి కూడా కరోనా విషయంలో తప్పులు చేసి ఉంటే ఇదే తరహాలో నిషేధం ఎదుర్కోనుంది