‘ఇష్క్’లో థ్రిల్ ఫీలయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి: తేజ

Teja sajja revealed some interesting news about his upcomming movie Ishq not a love story

జాంబీ రెడ్డి మూవీతో కథానాయకుడిగా హిట్ కొట్టిన ‘తేజ సజ్జ’ ఫుల్ జోష్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన తేజ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

Teja sajja revealed some interesting news about his upcomming movie Ishq not a love story
 

తేజ మాట్లాడుతూ … “అందరూ అనుకుంటున్నట్టుగా ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. కొత్త కథ … కొత్త ట్రీట్మెంట్ తో ఈ సినిమా సాగుతుంది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రేమకథగా కనిపించినప్పటికీ, ఫ్యామిలీతో పాటు చూడదగిన సినిమా ఇది. కథ, పాత్రలు ఎక్కడా కూడా పరిధిని దాటి వెళ్లవు. ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది .. ఎక్కడా బోర్ అనిపించదు.

ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. మహతి స్వరసాగర్ అందించిన పాటలు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ కథ నా వరకూ రావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో ఎస్.ఎస్. రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ చెక్ మూవీ ఫేమ్ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటించింది.