జగన్ తాత రాజారెడ్డి ని టార్గెట్ చేసిన టీడీపీ – జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది

Nara Lokesh satires on CM'S water bottles, Butter milk expenses

2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ నాయకుడు నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఉన్న లోపాలను ఎత్తు చూపుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను మాత్రం. వైసీపీ నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం వైసీపీ నాయకులురాలు రోజా మాట్లాడుతూ…నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను తమ పార్టీ నాయకులు ఎవ్వరు పట్టించుకోరని, తెలుగే మాట్లాడటటం రాని లోకేష్, ఒక కంటెంట్ రైటర్ ని పెట్టుకుని ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఆఫీస్ నుండి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 4700 కోట్లు కేటాయించింది. అయితే ఈ పతాకంపై నారా లోకేష్ ట్విట్టర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాన‌ని పావ‌లా వ‌డ్డీ పేరుతో మీ నాయ‌న ఐదేళ్ల‌లో 268 కోట్లు విదిల్చాడు, నువ్వేమో నెలకు 3000 చొప్పున ఐదేళ్లు ఇస్తామ‌ని స‌గం కోసి నెలకు 1500 లెక్క‌న నాలుగేళ్లకే ప‌రిమితం చేశావని, మీ నాయ‌నది న‌య‌వంచ‌న‌, నీది విశ్వాస‌ఘాతుకం, మీ వంశ‌మే మోసానికి ప్ర‌తిరూపం అని నిరూపించుకున్నావని కామెంట్స్ చేశాడు. జగన్ ను ఎవరన్నా ఒక చిన్న మాట అన్నా ఊరుకొని వైసీపీ నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ వంశం గురించి మాట్లాడిన లోకేష్ పై వైసీపీ నేతలు ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి. ప్రజలకు ఖచ్చితమైన ఆదాయ వనరులను కలిపించకుండా ప్రభుత్వాలు ఇలా పథకాలు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడవని రాజకీయ పండితులు, సామాన్యులు చెప్తున్నారు.