‘సీబీఐ ఎంక్వైరీ ‘ విషయం లో రెడ్ హ్యాండెడ్ గా ఇరుకున్న చంద్రబాబు!

జగన్‌ను ఆపే దమ్ము టీడీపీకి ఉందా..లేదా ?

చంద్రబాబు నాయుడుకి రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్ నుండి జగన్ వరకు చూశారు. రాజకీయాలను దగ్గరగా చూస్తూ వాటి నుండి నిరంతరం నేర్చుకునే ఉంటున్నారు.

గతంలో చంద్రబాబు పన్నిన బీవ్యూహాలకు చాలా మంది నాయకులు గిలాగిలకొట్టుకున్నారు. చాలామంది నాయకులు తమ రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పారు. అయితే ఎంత తెలివైన వాడైనా, ఎంత అనుభవం కలవాడైన ఎక్కడో ఒక చోట తనకు తెలియకుండానే తప్పు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు అదే తప్పు చేశారు. అడ్డంగా దొరికిపోయారు.

రాష్ట్రంలో ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దీనిపై ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాస్తూ ఈ వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, మోడీ సమర్ధత ముందు ఈ సమస్య చాలా చిన్నదని పేర్కొన్నారు. ఇక్కడే బాబు వైసీపీ నాయకులకు అడ్డంగా దొరికిపోయారు. 2014-19 మధ్య సీబీఐ వద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సీబీఐ కావాలంటాడని, మోడీ పోవాలి మన్మోహన్ రావాలని కాంగ్రెస్ జెండా ఎత్తుకున్న బాబే ఇప్పుడు మళ్లీ ఇప్పుడు మోడీకే జై అంటున్నాడని విమర్శిస్తున్నారు. బాబు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ నేతలు తిడుతున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు ఇప్పటికీ కర్ర విరగకుండా పామును చంపే రాజకీయాన్ని చేస్తుంటాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

చంద్రబాబు కొరగానే కేంద్రం కూడా ఈ విషయాన్నైనా సీబీఐకిఅప్పగించదని, దానికో ప్రొసీజర్ ఉంటుందని వైసీపీ నాయకులు వాదిస్తున్నారు. ఏదైనా తీవ్రమైన నేరాల్లో ఎవరైనా కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే విచారణ సరిగా జరగడం లేదని భావిస్తే.. అప్పుడు కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తాయనే విషయం కూడా బాబుకు తెలియకపోవడం చూస్తుంటే జాలేస్తుందని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఆధారాలు కూడా లేని విషయంపై సీబీఐ విచారణ కోరి చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ అనుభవాన్ని గంగలో కలుపుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగదని తెలిసే బాబు లేఖ రాశాడని, ఈ వ్యవహారాన్ని ప్రజల్లో రద్దుడానికి, ఎదో తప్పు జరిగిందనే భవన ప్రజల్లో కలిగించి వైసీపీపై వ్యతిరేకత తీసుకురావడానికి బాబు పన్నిన కుట్రని చాలామంది అంటున్నారు.