చంద్రబాబు మీద తిరగబడుతున్న టీడీపీ లోని బడా బడా సీనియర్ లు

Chandrababu Naidu should do proper plan to raise TDP

చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వేసిన రాజకీయ వ్యూహాలకు చాలామంది నేతలు చిత్తయిపోయిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు వ్యూహాలు పని చేయడం లేదు. ఆయన వ్యూహాలు వికటించి బాబే నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి విషయంలో టీడీపీ అధినేతకు కొత్త చిక్కు వచ్చింది. బాబు అమరావతిని రాజధానిగా నియమిస్తూ గతంలో శంకుస్థాపన చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి బాబుని చిక్కుల్లో పెట్టాడు. అమరావతిని రాజధానిగా చేసిన బాబు రాయలసీమ, ఉత్తరాంధ్రను వదిలేశారని, ఆ తప్పును సారి చేయడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పాడు.

జగన్ వేసిన ఈ వ్యూహానికి బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్రపై బాబు ఖచ్చితమైన నిర్ణయం వెల్లడించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు బాబు ఆ ప్రాంతాల అభివృద్ధికి అంగీకరిస్తే ఒక రకంగా జగన్ ను సమర్దించినట్టే అవుతుంది. దీంతో వాటిపై చంద్రబాబు ఇప్పటి వరకు ఒక ఖచ్ఛతమైన అభిప్రాయాన్ని వెల్లడించకపోవడంపై సొంత పార్టీ నేతలే తప్పు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే తెలంగాణలో పార్టీ తన పట్టును పూర్తిగా కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇటీవ‌ల రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై మా స్టాండును ఇప్పటికైనా చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. తీవ్రంగా న‌ష్టపోతాం. కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ల్లోనే పార్టీ దెబ్బ‌తిన్నది. ఈ విష‌యాలు మా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియ‌నివి కాదని అన్నారు. దీనిని బ‌ట్టి చంద్రబాబు వైఖ‌రిని పార్టీలోని సీనియ‌ర్లు కూడా వ్యతిరేకిస్తున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. యనమల వంటి కొంత మంది నాయకులు తప్ప చాలామంది సీనియర్ నాయకులు బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పడానికి రాజ‌ధాని కోసం చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆందోళ‌న‌ల‌కు వ‌చ్చిన తూర్పుగోదావ‌రి నేత‌ల్లో ప‌ట్టుమ‌ని ప‌దిమంది కీల‌క నేత‌లు లేక‌పోవ‌డం కూడా దీనిని రుజువుచేస్తోంది. సొంత నేతలే తనకు వ్యతిరేకంగా వ్యవహరించంతో బాబు తల పట్టుకున్నారు.