శ్రీ రెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదనుకోండి. అసలింతకీ ఈమె కొత్తగా తెరపైకి ఎందుకు రావల్సి వచ్చిందబ్బా.. అంత కొంపలు మునిగిపోయే పనేం వచ్చిందబ్బా అనుకుంటున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే, అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతున్నారంటూ ఈ మధ్య ఓ చర్చ సోషల్ మీడియాని కుతకుతలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న సందర్భం దొరికినా చైతూ, సమంతలు ఈ ఇష్యూపై పలు రకాల ప్రశ్నల్ని ఫేస్ చేయాల్సి వస్తోంది. కానీ, తెలివిగా వారిద్దరూ ఈ ఇష్యూను డైవర్ట్ చేసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇదే విషయమై తన అమూల్యమైన ఉచిత సలహా విన్నవించేందుకు శ్రీ రెడ్డి గారు కూడా లైన్‌లోకి వచ్చేశారండోయ్.
అక్కినేని అభిమానుల తరపున చై, సామ్‌లకు శ్రీరెడ్డి చేసిన ఆ స్వీట్ విజ్ఞప్తి ఏమిటనగా.. ‘సంసారం అన్నాకా అప్పుడప్పుడూ చిన్నచిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాటిని కూర్చొని సామరస్యంగా చక్కదిద్దుకోవాలి. కొన్ని విషయాల్లో ఎవరో ఒకరు రాజీ పడిపోతే, ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదైపోతుంది..’ అంటూ ఉచిత సలహాలిచ్చేసింది. అబ్బో శ్రీరెడ్డికి ఇంత సంస్కారం ఎప్పుడొచ్చేసిందా.? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, పెళ్లి తర్వాత సామ్ డ్రస్సింగ్ విషయంలోనూ శ్రీ రెడ్డి స్పందించింది. పెద్ద కుటుంబానికి చెందిన కోడలు సంస్కారవంతంగా డ్రస్సింగ్ చేసుకోవాలనీ, అది తన మాట కాదనీ, చెన్నైలో అందరూ ఇదే విషయమై మాట్లాడుకుంటున్నారనీ సెలవిచ్చింది. అబ్బో, అబ్బబ్బో శ్రీరెడ్డిలో ఈ ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన మార్పు ఏంటా.? అని నెటిజన్లు అవాక్కయిపోతున్నారు మరి.