సోనియా స్ట్రాంగ్ డెసిషన్ – రేవంత్ రెడ్డి కి పి‌సి‌సి అధ్యక్ష పదవి ?

revanth reddy writes open letter to cm kcr

ఒక్కప్పుడు దేశ రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు ఏలారు. కానీ ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాదాపు పతనావస్థకు చేరుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తెలంగాణలో తెరాసకు, కేసీఆర్ కు ఎదురుగా నిలబడే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో తెరాసకు,కేసీఆర్ ను ధైర్యంగా ఎదురిస్తూ, కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణను తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రేవంత్ కు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడం లేదు.

కాంగ్రెస్ నుండే రేవంత్ కు వ్యతిరేకత

కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఉన్నతికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పెద్దల దృష్టిలో పడ్డారు. రేవంత్ రెడ్డికి వస్తున్న పేరును, గుర్తింపును కాంగ్రెస్ సీనియర్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎవరో చాలామంది ప్రజలకు తెలియదు, కాంగ్రెస్ కు ప్రజల్లో గుర్తింపును రేవంత్ తెచ్చారు. ఈ గ్రూప్ రాజకీయాల వల్లే రేవంత్ కు కాంగ్రెస్ పెద్దల నుండి రావలసిన గుర్తింపు రావడం లేదు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ !!

రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు చాలా ప్రయత్నాలు చేశారు అయితే ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా, వ్యతిరేకత వ్యక్తం చేయడం, అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.ఇటువంటి చర్యల తో ఎప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలు ముగిసినా, గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇక్కడ టిఆర్ఎస్ హవాను తట్టుకుంటూ బీజేపీకి అవకాశం దక్కకుండా, కాంగ్రెస్ కు అధికారం తీసుకురావాలంటే తప్పనిసరిగా రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిప్రాయాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మెజారిటీ సీనియర్లు రేవంత్ కు ఆ పదవి అప్పగించడంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారట. రేవంత్ ను బీజేపీలోకి తీసుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.