ఆయన్ని కాపాడ్డానికి రియల్ హీరో సోనూ సూద్ అన్ని ప్రయత్నాలు!

ప్రముఖ స్టార్ నటుడు సోనూ సూద్ గత్ రెండు ఏళ్ళు పాటుగా భారతదేశ ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు. లక్షల్లో దేశ నలుమూలల నుంచి ఎంతోమంది సోను సూద్ సాయం అందుకున్న వారు ఉన్నారు. అయితే తన సేవలు కేవలం కరోనా బాధితులికే కాకుండా సాయం అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా అందుబాటులో ఉంటున్నాడు.

మరి ఇప్పుడు ఈ రియల్ హీరో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు కాపాడ్డానికి ముందుకొచ్చారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన ప్రస్తుతం వారి కుటుంబంతోనే టచ్ లో ఉన్నానని, ఆయన్ని కాపాడటానికి నా వల్ల అయ్యినది అంతా చేసి తీరుతానని సోనూసూద్ ప్రామిస్ చేసాడు. దీనితో ఆయన బతకాలి అని కోరుకునే వారికి కాస్త ఊరట లభించింది.