ఆ కలెక్షన్స్ అన్ని ప్రజాసేవకే.. మళ్లీ పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్!

విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోను సూద్. నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువగా సమాజసేవ ద్వారా పేరు సంపాదించుకున్నాడు. అతను సినిమాలలో విలన్ వేషాలు వేసినా రియల్ లైఫ్ లో మాత్రం ఎంతోమంది జీవితానికి హీరో అయ్యాడు. కోవిడ్ నుంచి సాగుతున్న అతని సమాజసేవ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు మొదటిసారి ఒక సినిమాకి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు రచన కూడా అతనిదే. ఆ సినిమాకి ఫతే అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.

జాక్విలీన్ ఫెర్నాన్డేజ్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ చిత్రం జనవరి 10, 2025న విడుదల కి సిద్ధమవుతుంది.ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే హిట్, ఫ్లాపు అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాపై వచ్చే కలెక్షన్స్ అన్ని అనాధాశ్రమానికి, వృద్ధాశ్రమానికి పంపిస్తామని ప్రకటించాడు సోనూసూద్. ఈ చిత్రానికి నిర్మాత సోనుసూద్ భార్య సోనాలి సూద్ కావటం విశేషం.

సైబర్ క్రైమ్ సిండికేట్ ని ఢీ కొట్టి చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను చేధించి ఎందరో జీవితాల్లో వెలుగు నిలిపి వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రజల కోసం తీసింది అందుకే ఈ సినిమాపై వచ్చే డబ్బులు ప్రజలకే ఉపయోగపడాలి అందుకే ఈ డబ్బులు అన్ని అనాధాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తాం అని చెప్పి మళ్లీ తన పెద్ద మనసు చాటుకున్నాడు ఈ హీరో. శక్తిసాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోనాలి సూద్ మరియు ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ థ్రిల్లర్ సినిమా దియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.

సోనూసూద్, జాక్విలిన్ ఫెర్నాన్డేజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ రాజ్, నసరుద్దీన్ షా, దిబ్యేందు భట్టాచార్య, ప్రకాష్ బెలవాడి మరియు శివ జ్యోతి రాజ్ పుత్ లు కీలకపాత్రలు పోషించారు. విన్సెంజో కొండోరెల్లి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. యష్ పారిక్ మరియు చంద్రశేఖర్ ప్రజాపతి సినిమాకు ఎడిటింగ్ చేయగా జాన్ స్టీవర్ట్ ఎదురి బ్యాగ్రౌండ్స్ స్కోర్ ని హ్యాండిల్ చేశారు.