Somy Ali: పాకిస్థాన్ బ్యూటీ సోమి అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పాకిస్తాన్ లో పుట్టి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆ తర్వాత ఆ మధ్యలో ఒకసారి ఇండియాకు వచ్చి సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ తాను అనుకున్న విధంగా సక్సెస్ ను సాధించకపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ ను వదిలేసి తిరిగి అమెరికా కి వెళ్ళిపోయింది. అయితే ఆమె అమెరికా కి వెళ్ళిపోయిన తరువాత ప్రస్తుతం ఆమె చేస్తున్న పని గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
ఈమె ఎన్జీవో స్థాపించి హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యే బాధితులను కాపాడుతూ ఉంటుంది. వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్లో కూడా బ్రేవ్ లేడీ అన్ని గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తనకు ఎదురయ్యే హెచ్చరికలు, గంధాల గురించి తెలిపింది. సోమీ అలీ మాతృ దేశం పాకిస్థాన్. కానీ ఆ దేశంలోని చాలామంది మగవాళ్ళు ఆమెను చంపేస్తామని బెదిరిస్తుంటారట. ఆమె ఎప్పుడూ పాకిస్తాన్ కి వచ్చిన అప్పుడు నీ సంగతి తేల్చేస్తాం అంటూ ఈ-మెయిల్ పంపుతారని సోమి అలి చెప్పుకొచ్చింది. ఈమె నో మోర్ టియర్స్ అరే స్వచ్ఛంద సంస్థ ద్వారా మానవ అక్రమ రవాణా బాధితులను కాపాడుతూ ఉంటుంది.
అందులో భాగంగా ముఖ్యంగా గే విక్టీమ్స్ కి సోమి అలీ చట్టపరమైన రక్షణ కల్పించడంలో ముందు ఉంటుంది. అదే చాలా మంది కోపానికి ప్రతీకారానికి ముఖ్య కారణమట. ఆ భయంతోనే ఆమె ఎన్నో సంవత్సరాలుగా పాకిస్తాన్ కు వెళ్లలేదట. ఒకవేళ పాకిస్తాన్ కి వెళ్తే ప్రాణ గండం తప్పదు అంటోంది సోమీ అలీ. ఇక అప్పట్లో సోమీ అలీ, సల్మాన్ ఖాన్ ల మధ్య పదేళ్లపాటు రిలేషన్ కొనసాగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సల్మాన్ ఖాన్ తో ఉండలేక అతనికి బ్రేకప్ చెప్పి అతని ముంబైలో విడిచి అమెరికాకు వెళ్లి పోయింది. దశాబ్దం పాటు ఇండియాలో ఉన్న ఆమె ఇప్పుడు తనకు భారతదేశం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మొదట భారతదేశం ఆ తర్వాత పాకిస్తాన్ అని చెబుతోంది.