Corona Positive: ప్రస్తుత దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు 3 లక్షల పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభించి రెండు సంవత్సరాలు దాటింది. సామాన్యులు, గొప్పవారు అని తేడా లేకుండా చాలామంది దీని బారిన పడి ప్రాణం కోల్పోయారు.
కరోనా వాటి రూపాంతరాలను మార్చుకొని ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెంది ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందింది అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తేలికపాటి గా ఉన్నప్పటికీ.. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనోవేదన వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటన ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కరోనా సోకిందని తెలిసి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలలోకి వెళితే.. భద్రాచలం జిల్లాకు చెందిన అలేఖ్య అనే యువతి హైదరాబాదులో అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో నివాసం ఉంటోంది. ఈమె వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఈనెల 21వ తేదీన అలేఖ్య అనారోగ్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. అందువల్ల ఈమె నివాసంలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది.
అలేఖ్య ప్రతిరోజు కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ నెల 23వ తేదీ అలేఖ్య తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అలేఖ్య స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆమె ఉన్న నివాసానికి చేరుకొని చూడగా ఆమె పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా విలపించారు. అలేఖ్య కరోనా సోకిందని మనోవేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని శరీరాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కరోనా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.