నటి యమునా జీవితంలో మరచిపోలేని సంఘటన.. అదేంటంటే?

యమునా తెలుగు చలనచిత్ర నటి. తెలుగు తమిళ మలయాళ భాషలలో నటించింది. 1971లో బెంగళూరులో జన్మించింది. ఈమె తమకు దగ్గరి బంధువైన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి ఈమెకు ఇద్దరు కూతుర్లు సంతానం. ఈమెకు సినిమాలలో నటించాలంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. తన అక్క జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుంటే అప్పుడప్పుడు తోడుగా వెళ్ళేది.

ఒకసారి కే. బాలచందర్ బాల్య నటి కోసం ప్రయత్నిస్తుండగా ఈమెను చూసి బాగుంటుంది అని అడిషన్ చేయకుండానే ఓకే చెప్పేశాడు. కానీ ఈమెకు ఇంట్రెస్ట్ లేదని తల్లికి చెప్పినా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదని నచ్చజెప్పి ఆ సినిమాకు ఒప్పించింది. ఆ సినిమా మంచి విజయం సాధించి వందరోజుల ఫంక్షన్ లో కే బాలచందర్ గారు ఈ అమ్మాయి మంచి స్టార్ గా ఎదుగుతుంది తర్వాత ఈమె డేట్స్ దొరకడం కూడా కష్టమవుతుంది అని వ్యాఖ్యానించాడు.

ఆ తర్వాత 1989లో వచ్చిన మౌన పోరాటం సినిమా ఈమె కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస అవకాశాలలో ఇటు కన్నడా, అటు తెలుగులో బిజీగా మారిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది. తన వద్ద మేనేజర్ లేకపోవడం వలన డేట్స్ చూసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం తెలియక మంచి మంచి అవకాశాలను చేజేతులా వదులుకుంది.

ఇక ఈమె జీవితంలో 2011లో ఒక హోటల్ లో జరిగిన పోలీసుల దాడిలో వ్యభిచార ఆరోపణలపై ఈమెను అరెస్టు చేయడం జరిగింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని న్యాయస్థానం కొట్టివేసింది. తరువాత తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుందామని, ఉన్న ఆస్తిని పిల్లలపై వీలు రాద్దామని తన స్నేహితురాలికి ఫోన్ చేసింది.

ఆ స్నేహితురాలు నీవు చనిపోతే పిల్లల పరిస్థితి దారుణంగా ఉంటుంది. డబ్బు ఉంటే సరిపోదు మంచి చెడ్డలు ఎవరు చూస్తారు అని ధైర్యం చెప్పడంతో ఇక ఆ విషయాలను పక్కన పెట్టి ఇక సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా సీరియల్ లలో నటించడం మొదలుపెట్టింది. అప్పట్లో తెలుగులో అన్వేషణ సీరియల్ ద్వారా మరింత పాపులర్ గా ఎదిగింది. ప్రస్తుతం పలు సీరియల్ లో నటిస్తుంది.