కరోనా వైరస్ ఈ ఏడాది కూడా కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను కలవరపరుస్తూ తీవ్రంగా వ్యాపించి
గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది.
ఇప్పటికే చైనాలో కొత్త కరోనా వేరియంట్ BF.7 తీవ్రంగా వ్యాపించి లక్షలాదిమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు భారత్ తో సహా అన్ని దేశాల్లో తీవ్రంగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.మరోవైపు అమెరికాలో X BB.1.5 ఒమిక్రన్ వేరియంట్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతూ దాదాపు 40 శాతం మంది ప్రజలకు ఇప్పటికే వ్యాప్తి జరిగిందని అధికారులు స్పష్టం చేస్తూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అమెరికాలో తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న XBB.1.5 వేరియంట్ BQ1 కంటే 120 శాతం వేగంగా వ్యాపిస్తుంది. U.S.లో 40 శాతం కంటే ఎక్కువ కేసులు Omicron యొక్క XBB.1.5 వేరియంట్ అని నిపుణులు తెలిపారు. XBB.1.5 వేరియంట్ యొక్క కొన్ని లక్షణాలు ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, చలి, తుమ్ములు, దగ్గు దీని ప్రధాన లక్షణాలు. అమెరికాలో తీవ్రంగా వ్యాపిస్తున్న XBB.1.5 వేరియంట్ XBB మొదటిసారిగా ఆగస్టులో భారతదేశంలో కనుగొనబడింది. XBB.1.5 వేరియంట్‌కు మరో మ్యుటేషన్ జోడించబడిందని నిపుణులు చెబుతున్నారు
కొత్త XBB.1.5 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉండడంతో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా XBB.1.5 మ్యుటేషన్ శరీరంలో తీవ్రంగా వ్యాపించి మనలో వ్యాధి నిరోధక శక్తి తొందరగా బలహీన పరుస్తుంది. అయితే ఇప్పుడున్న అన్ని కరోనా వ్యాక్సిన్లు XBB యొక్క అన్ని వేరియంట్ లపై ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.