ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే లెవల్ మారిపోతుంది. అదే రెండు మూడు హిట్లు పడితే కాసుల వర్షం కురుస్తుంది. అందుకే ప్రతి హీరో కూడ మొదటి రెండు మూడు సినిమాలు మంచి హిట్లు అవ్వాలని కోరుకుంటుంటారు. ఒక్కొక హిట్ పడేకొద్దీ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతుంటారు. కానీ ఒక కుర్ర హీరో మాత్రం హిట్ రుచి చూడకుండానే భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. అది కూడ ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
ఆ హీరో మొదటి సినిమా కోటి రూపాయల లోపు వ్యయంతో తెరకెక్కిన సినిమా. విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. అయితే చాలా చోట్ల ఆ సినిమా వచ్చింది పోయింది కూడ తెలియదు చాలామందికి. ప్రాజెక్ట్ అతని చేతిలో మూడు నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో మూడు సెట్స్ మీదున్నాయి. మూడు సినిమాల్లో కనీసం రెండు మంచి హిట్లు అవుతాయని నమ్ముతున్నాడు ఆ హీరో. అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయడానికి రెండు కోట్ల పారితోషకం కోరుతున్నాడట. అంతెందుకు అంటే రాబోయే హిట్ సినిమాలను గుర్తుచేస్తున్నాడట. అతని ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నవ్వాలో, ఏడవాలో అర్థంకావట్లేదు అంటున్నారు చిన్న చిన్న నిర్మాతలు.