ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న శృతిహాసన్.. ముఖ్యంగా ఆ విషయంలో..?

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన శృతిహాసన్ ఇక్కడి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శృతిహాసన్ ట్రాక్ సినిమా ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్లీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సలార్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో సందడి చేస్తోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తనకి ఇష్టమైన కో-స్టార్ ఎవరు అని అడిగితే వెంటనే ప్రభాస్ పేరు చెప్పేసింది. ఈ క్రమంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అంతే కాకుండా ప్రభాస్ రిసీవింగ్ కి కూడా శృతిహాసన్ ఫిదా అయిపోయింది. సలార్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శృతిహాసన్ కి ప్రభాస్ తన ఇంటి నుండి భోజనం తెప్పించేవాడు. ఆ ఫుడ్ గురించి శృతిహాసన్ ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సెట్ లో ప్రభాస్ అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడని, ప్రభాస్ డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రభాస్ గురించి ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. మొత్తానికి శృతిహాసన్ ప్రభాస్ గురించి చెప్తూ..తన మీద పొగడ్తలు కురిపిస్తోంది.