షాకింగ్ గాసిప్ : ఎన్టీఆర్ సినిమాని రిజెక్ట్ చేసిన మరో హీరోయిన్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సెన్సేషనల్ కాంబో లలో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్ కూడా ఒకటి. కొరటాలకి దీనికి ముందు ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ తన స్టామినా తో పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ తేగలిగాడు.

ఇక్కడ వరకు సినిమాకి బాగానే ఉంది కానీ సినిమాకి మాత్రం ఇతర ఏ అంశాలు కూడా పెద్దగా సెట్టవ్వట్లేదు. సినిమా హీరోయిన్ నుంచి ఇప్పుడు సినిమా స్టార్ట్ అవ్వడం వరకు కూడా పెద్ద డ్రామానే నడుస్తుండగా ఇప్పుడు ఈ సినిమాని మరో స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పి రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి లేటెస్ట్ గాసిప్ ప్రకారం అయితే గతంలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఎన్టీఆర్ తో సినిమా రిజెక్ట్ చెయ్యగా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ దగ్గరకి వచ్చింది ఈ సినిమా కానీ ఇప్పుడు ఈమె కూడా ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టుగా సినీ వర్గాల్లో షాకింగ్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనితో సినిమాకి మరో షాక్ తగిలింది అని చెప్పాలి. మొత్తానికి అయితే సినిమా హీరోయిన్ ఎవరూ అనేది బాగా ఆసక్తిగా మారింది. ఫైనల్ గా అయితే కొరటాల ఎవరిని ఫిక్స్ చేస్తారో అనేది వేచి చూడాలి.