Fast Walking: వేగంగా నడవటం వల్ల మహిళల్లో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్..!

Fast Walking: మనిషి ఆరోగ్యానికి పౌష్టిక ఎంత అవసరమో, వ్యాయామం చేయటం కూడా అంతే అవసరం. వ్యాయామాలు చేయలేని వారు ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు.. కానీ వేగంగా నడవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన ఉండదు.వేగంగా నడవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

ఇటీవల అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల ప్రకారం వేగంగా నడిచే వారి కంటే నెమ్మదిగా నడిచే మహిళల్లో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయని తేలింది. 17 సంవత్సరాల పాటు 25183 మంది మహిళలను ట్రాక్ చేయగా నడక వేగం తక్కువగా ఉన్న వారిలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తాయని, నడక వేగం ఎక్కువగా ఉన్న వారిలో గుండె సంబంధిత సమస్యలు లేవని నిరూపణ అయ్యింది.

డాక్టర్ చార్లెస్ ఈటన్ అధ్యయనం ప్రకారం నడక వేగాన్ని బట్టి గుండె ఆరోగ్యం అంచనా వేయవచ్చు. వేగంగా నడవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందువల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం నెమ్మదిగా నడిచే వారిలో గుండెకి సంబంధించిన కండరాలకు నష్టం కలుగుతుంది.

వారంలో ఒక గంట సమయం పాటు వేగంగా నడవటం వల్ల ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వయసు మీద పడిన వారు అతి వేగంగా కాకపోయినా సగటు వేగంగా నడవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. తక్కువ సమయంలో వేగంగా నడవటం వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేసిన మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.