Shanmukh-Jaswanth: బిగ్ బాస్ విన్నర్ కన్నా ఎక్కువ గెలుచుకున్న రన్నర్ షణ్ముఖ్.. ఎంతంటే?

Shanmukh-Jaswanth: యూట్యూబ్ ద్వారా ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే పాపులారిటీతో ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నాలుగు వారాలు తో టాప్ పొజిషన్ లో ఉండి విన్నర్ రేస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ సిరితో ఫ్రెండ్షిప్ అంటూ సిరి మాయలో పడి పూర్తిగా అశ్రద్ధ వహించారు. దీంతో ఈయనకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడమే కాకుండా అనూహ్యంగా మొదటి స్థానంలోకి వెళ్ళాడు.

ఇలా ఐదు వారాల నుంచి సన్నీ మొదటి స్థానంలో ఉండి చివరికి బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.బిగ్ బాస్ టైటిల్ అందుకోవడానికి అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ షణ్ముఖ్ సిరితో రొమాన్స్ చేయడం తరుచూ తనని హగ్ చేసుకుంటూ, కిస్సులు పెట్టుకుంటూ రచ్చ చేయడంతో వీరి పై నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీరిపై కాస్తా నెగిటివిటీ ఏర్పడటమే ప్రస్తుతం షణ్ముఖ్ ని బిగ్ బాస్ ట్రోఫీకి దూరం చేసిందని చెప్పాలి.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ పారితోషికం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామూలుగా యూట్యూబ్ ద్వారా షణ్ముఖ్ జస్వంత్ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ అతడి ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకొని వారానికి 4 నుంచి 5 లక్షల వరకు పారితోషికం చెల్లించనున్నట్లు డీల్ కుదుర్చుకున్నారనీ సమాచారం. ఈ క్రమంలోనే 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన షణ్ముఖ్ జస్వంత్ సుమారు 65 లక్షల రూపాయలు గెలుచుకొని బిగ్ బాస్ విన్నర్ కన్నా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు.